సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కాంతార సినిమాతో 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ కొట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కాంతార ప్రీక్వెల్ సినిమా వచ్చే అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే కొంత కాలంగా వరుస మరణాలు కాంతార యూనిట్ ని భయపెడుతున్నాయి.ఇప్పటికే కాంతార ప్రీక్వెల్ సినిమాలో నటించిన ఇద్దరు యువకులు మేలో చనిపోయారు. ఆ తర్వాత జూన్ లో కాంతారలో నటించిన కళాభవన్ అనే నటుడు చనిపోయాడు. తాజాగా కాంతార లో నటించిన రంగస్థల నటుడు ప్రభాకర్ కళ్యాణి మరణించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభాకర్ ఆగస్టు 7 గురువారం నాడు మరణించారు. ప్రభాకర్ ఫ్యామిలీ చెప్పిన దాని ప్రకారం.. ఇటీవల ప్రభాకర్ ఇంట్లో జారి పడి చికిత్స తీసుకుంటున్నాడు. గురువారం నాడు కళ్ళు, చేతులు నొప్పిగా ఉన్నాయని చెప్పడంతో అతన్ని హాస్పిటల్ కి తరలించేలోపే మధ్యలో మరణించాడని తెలిపారు. కొంతకాలం క్రితం కాంతార సెట్ లో అగ్ని ప్రమాదం జరగడం, కొంతమందికి కాంతార సెట్లో ప్రమాదాలు లో గాయాలు అవ్వడం.. కాంతార మూవీ యూనిట్ లో అసలేం జరుగుతుంది అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
