సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: కాకినాడటౌన్‌ నుండి సంక్రాంతి సందర్భంగా విజయవాడ మీదుగా కాకినాడటౌన్‌–లింగంపల్లి మధ్య 14ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. రైలు నంబర్‌ 07275 జనవరి 3, 5, 7 తేదీలలో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07276) జనవరి 4, 6, 8 తేదీలలో సాయంత్రం 6.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. రైలు నంబర్‌ 07491 జనవరి 10, 12, 14, 17 తేదీల్లో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07492) జనవరి 13, 15, 18 తేదీల్లో సాయంత్రం 6.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. రైలు నంబర్‌ 82714 జనవరి 11న సాయంత్రం 6.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది.కాకినాడ టౌన్‌ నుంచి శబరిమల వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైలు (07147) జనవరి 4, 11 తేదీలలో సాయంత్రం 5 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3.15 గంటలకు ఎర్నాకుళం చేరుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *