సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపటి జనవరి 6వ తేదీ నుండి సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే 52 అదనపు రైళ్లను హైదరాబాద్ మహానగరంలోని వివిధ ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు నడుపుతోన్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, లింగంపల్లి, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళంలకు ఈ అదనపు రైళ్లను నడుపుతోన్నట్లు ప్రకటించింది. ఈ ప్రాంతాలకు జనవరి 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ తాజా ప్రకటనలో వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *