సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈరోజు శనివారం ఉదయం ఒకే తరహా 2 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కాకినాడ సమీపంలోని తుని హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో రహదారిపై వెళ్తోన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందుగా వెళ్తోన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ పరిధి చిన్నారికట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. నేటి తెల్లవారు జామున రోడ్డు పక్కన ఆగి ఉన్న మినీ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఆ తర్వాత వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఆ ప్రైవేట్ బస్సును తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో 12మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *