సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో షిరిడి సాయి బాబా భక్తులకు కొదవ లేదు. నిజానికి మహారాష్ట్ర లో కన్నా తెలుగు రాష్ట్రాల లోనే సాయి భక్తులు ఎక్కవ ఉంటారంటే అతిశయోక్తి లేదు. వారి భక్తిని చాటుతూ వాడవాడలా ఎన్నో సాయి బాబా మందిరాలు, అక్కడ ప్రతి గురువారం అన్నసమరధానలు కోకొల్లుగా జరుగుతూనే ఉంటాయి. అయితే . కాకినాడ జిల్లా ‘మరువాడ’ గ్రామ శివారులో, పచ్చని పంట పొలాలు, ఎత్తైన కొబ్బరి చెట్ల మధ్య ఆకాశాన్ని తాకేలా 120 అడుగుల ఎత్తులో కొలువుదీరిన సాయిబాబా మహావిగ్రహం 2026 నూతన సంవత్సరాన్ని ప్రారంభ సాక్షిగా భక్తుల మనసులను పరవశింపజేస్తోంది. సాయిదాసినిగా పేరుగాంచిన సత్యవేణి ఆధ్వర్యంలో, గురువులు సాంబశివరావు పర్యవేక్షణలో ఈ మహావిగ్రహాన్ని బాబాఆలయ సమీపంలో ప్రతిష్టిస్తారు. వారం రోజుల ముందుగా అక్కడ జరుగుతున్నా సాయి ఆధ్యాతిమిక కార్యక్రమాల కోసం పక్క రాష్ట్రాల నుంచి కూడా సాయి భక్తులు ఇప్పటికే తరలివచ్చారు.
