సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం నాడు విశాఖలో కాగ్నిజెంట్ సహా 9 ఐటీ కంపెనీలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొని ప్రసంగించారు. విశాఖ ను ఆర్ధిక రాజధానిగా మారుస్తున్నామని, వై నాట్ వైజాగ్ అనే ప్రశ్న ఉదయించేలా ఐటీ కంపెనీలు, పరిశ్రమల్ని ఈ ప్రాంతానికి ఆహ్వానిస్తున్నామన్నారు. 2025 దావోస్‌లో కలిసి కాగ్నిజెంట్‌ను విశాఖకు ఆహ్వానించామని.. ఇప్పుడు ఆ సంస్థ నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిందని అన్నారు. వైజాగ్ అభివృద్ధి కోసం యువతకు ఉపాధి కోసం ఎవరి విమర్శలు లెక్కచెయ్యమని ప్రముఖ సంస్థలకు పారిశ్రామిక ఔత్సహికులకు ప్రోత్సాహకంగా ఎకరా భూమిని 99 పైసలకు ఇస్తామని వారికి హామీ ఇచ్చామని.. ఆ మేరకే వారికి భూమి ఇచ్చామని ప్రకటించారు. విశాఖపట్నం ఐటీ, జీసీసీ కేంద్రంగా మారుతుందని.ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *