సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనెల 17వ తేదీన తెలంగాణలోని సీఎస్ కానిస్టేబుల్‌ ప్రమోద్ నిజామాబాద్ లోని 40 కేసులలో నిందితుడు కరుడుకట్టిన నేరస్తుడు రియాజ్ ను అరెస్ట్ చేసినప్పుడు అతడు కత్తితో ఛాతీపై పొడిచి కానిస్టేబుల్ ను చంపి పరారయిన ఘటన..ఆ సమయంలో చూస్తున్న స్థానికులు కానిస్టేబుల్ ను రక్షించే ప్రయత్నం చెయ్యకుండా వీడియోలు తియ్యడం తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపింది. తాజగా నేడు, సోమవారం నిందితుడు రియాజ్ పోలిసుల ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. నిజానికి కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను కత్తితో ఛాతిలో పొడిచి చంపిన రియాజ్‌, గత ఆదివారం మరో యువకుడు ఆసిఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో ఆసిఫ్‌తో హోరాహోరీ జరిగిన ఘర్షణలో రియాజ్‌కు గాయాలయ్యాయి. పోలీసులు అతడిని నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆస్పత్రి నుంచి పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నం చేశాడు. అడ్డుపడిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ నుంచి తుపాకీ లాక్కునేందుకు యత్నించాడు. ఆత్మరక్షణ కోసం రియాజ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు రియాజ్ మృతి చెందినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. అమరుడైన కానిస్టేబుల్‌ ప్రమోద్ ఒక కోటిరూపాయలు ఎక్స్ గ్రేషియా, కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీతో పాటు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం, GO 155 ప్రకారం 300 గజాల ఇంటి స్థలం, ఇతర అలవెన్సులు మంజూరు చేస్తామన్నారు.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *