సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు, ఆదివారం మంగళగిరి లోని పార్టీ కార్యాలయం లో కాపు సంక్షేమ సేన నేతలు, ప్రతినిధులు సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న కాపు కులం నుండి రాజ్యాధికారం ఎవరు సాదించలేకపోతున్నారని, దీనిపై సమాజంలో కాపుల విషయంలో బిసిలు, ఎస్ సి , ఎస్టీ లలో ఒక విషప్రచారం ఎన్నో ఏళ్లుగా జరుగుతుందని, అది తప్పు అని మనం నిరూపించవలసిన సమయం వచ్చిందని.. కాపులు సమాజ పెద్దలుగా ఎదగాలని మిగతా కులాలకు కూడా అండగా ఉండాలని పిలుపు ఇచ్చారు. నా తండ్రి కాపు.. నా తల్లి బలిజ ఆ మూలాలు నేను తక్కువ చేసుకోనని.. కొందరు బయటి వారికీ ఊడిగం చేసే కాపులు.. మీరు రాజకీయలు కు పనికిరారని నా ముఖం పైనే చెప్పారని ఇకపై ఎక్కడైనా ఎవరైనా ‘ కాపులు పార్టీలను నడపలేరని ఎవరైనా అంటే.. చెప్పు తెగేలా సమాధానం చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం గాజువాక లో అత్యధిక సంఖ్యలో ఉన్న కాపులందరూ నాకే ఓటు వేసి ఉంటె గెలిచేవాడిని.. ఐక్యత లేదు.. కాపుల లోనే వెన్నుపోటుదారులు ఉన్నారు. తాను మెత్తటి మనిషిని కాదని హెచ్చరించారు.కాపుల సంఖ్యాబలం ఉన్నా ఇంకా రిజర్వేషన్ల కోసం, అధికారం కోసం దేహి అని అడుక్కునే పరిస్థితి ఉందని పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు.‘రాయలసీమ లోని మైన్స్ అన్నీ సీఎం కుటుంబం చేతిలోనే ఉన్నాయి. నిజానికి అవి గతంలో బలిజలువి అని నాకు తెలిసింది. రాయలసీమలో కాపులు బలిజలు గొంతు ఎత్తలేరు. ముందు మనలో కట్టడి రావాలి. అధికారంలోకి వస్తున్నా కులాలలో ఆ కట్టడి ఉంది. ఐక్యత ఉంటేనే రాజ్యాధికారం సాధ్యం. నన్ను నా సామాజికవర్గం వాళ్లతోనే తిట్టిస్తున్నారు. జనసేన తగ్గించదు. డబ్బులతో రాజకీయ పార్టీలను నడపలేరు. బీఎస్పీ నేత కాన్షీరామ్ మాకు ఆదర్శం. నేను భయపడే వ్యక్తిని కాదు అన్నారు.
