సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వివాదాస్వదా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ చంద్రబాబు తో పొత్తు కు సిద్ధం కావడం ఫై చేసిన గాటు వ్యాఖ్యలుతో చేసిన ట్విట్ ( చంద్రబాబు కు కాపులను పవన్ అమ్మేసాడని , ఆఖరికి చంద్రబాబు కులపోళ్ళు గెలిచారని.. RIP అంటూ తీవ్ర పదజాలంతో.. ) ను ఆంధ్రప్రదేశ్ కాపు సంఘాల జేఏసీ తీవ్రం గా ఖండించింది. విజయవాడ మీడియా క్లబ్ లో కాపు నేతలు అత్యవసర సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహనరావు మాట్లాడుతూ.. .మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య ఇటీవల జరిగిన సమావేశం పై రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయడం వెనుక వైసిపి నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. ఇప్పుడున్న కాపు మంత్రులంతా.. జాతిని ముఖ్యమంత్రి జగన్ కు తాకట్టు పెట్టారని విమర్శించారు. రామ్ గోపాల్ వర్మ ను అయన కుటుంబ సభ్యులే అస్యహించుకొంటుందని, ఆయన హద్దులలో ఉంటె మంచిదని వ్యాఖ్యానించారు.
