సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కు చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ , మాజీ మంత్రి , ప్రస్తుతం కాపు రిజర్వే షన్ల సాధన కోసం దీక్షకు దిగిన మాజీ మం త్రి హరిరామజోగయ్య కు నేడు, సోమవారం జనసేన అధినేత పవన్ కల్యా ణ్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యు లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం 85 ఏళ్ల వయసులో జోగయ్య దీక్ష చేస్తున్నారని.. ఆయన ఆమరణ దీక్షపై ప్రభుత్వం తక్షణం స్పందిం చాలని పవన్ కళ్యాణ్ డిమాం డ్ చేశారు. ‘హరిరామజోగయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉం ది. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్చలు జరపాలి’ అని పవన్ కోరారు. నేడు, సోమవారం పాలకొల్లు లో నిరవధిక నిరాహార దీక్ష కు సిద్దమైన జోగయ్యను గత ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకోని అంబులెన్సు లో ఆసుపత్రికి తరలించడం అక్కడ ఆహారం తీసుకోకుండా ఆయన దీక్ష చేస్తుండటం గమనార్హం..
