సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వాలంటీర్లు వ్యవస్థ నిర్వహణ, ఆడపిల్లలకు నెలకు 1500 రూపాయలు,నిరుద్యోగ భృతి, ఉచిత గ్యాస్ సిలెండర్లు హామీలు ఫై ఇంకా నిర్ణయాలు తీసుకోనప్పటికీ, వచ్చే జులై నెల 1వ తేదీ న ప్రతి పేదవాడికి రూ.7 వేలు పింఛన్ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతీ నెలా వృద్ధులకు అందించే మూడు వేల రూపాయల పింఛన్‌ను వెయ్యి పెంచి నాలుగు వేలు అందించ నుంది. అయితే ఎన్నికల వాగ్దానం మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా వెయ్యి చొప్పున పెంచి జూలైలో ఏడు వేలు ఇవ్వనున్నారు. అయితే వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు ఫై సందిగ్ధత ఉండటంతో జిల్లాలో గత ప్రభుత్వం సచివాలయాల్లో నియామకం చేసిన 4 వేల 200 మంది సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వీటిని ఇంటింటికి పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. జిల్లాలో రెండు లక్షల 34 వేల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో వృద్ధులు, వితంతువులకు రూ.నాలుగు వేలు చొప్పున ఇస్తారు. దివ్యాంగుల పింఛన్ ఆరు వేలుకు పెంచుతూ వచ్చే ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్‌ను అందజేస్తారు. దీంతో ఒక్కో దివ్యాంగునికి జూన్‌లో రూ.12 వేలు అందనుంది. జిల్లావ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.69 కోట్ల వరకు పెన్షన్ కోసం ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వంలో పెంచిన పెన్షన్‌తోపాటు పెంచిన అదనపు సొమ్ముతో కలిపి రూ.150 కోట్లు ఒకే నెలలో లబ్ధిదారులకు ఇవ్వవలసి ఉంది .అలాగే ఆగస్టు నెలలో జిల్లాలోని భీమవరం లో 3, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లులోని మొత్తం తొమ్మిది అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కూడా ఆమోదముద్ర పడింది.అక్కడ కేవలం ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం పెడతారు. అయితే ఉదయం టిఫిన్, సాయంత్రం భోజనం ఫై వివరణ రావాల్సి ఉంది. కొసమెరుపు ఏమిటంటే.. జులై 2వ వారం నుండి జిల్లా వ్యాప్తంగా పింఛను దారులు ఫై సచివాలయ ఉద్యోగులతో సర్వే ఉంటుందని ప్రభుత్వ నిబంధలు కు దూరంగా ఉన్న పింఛనులు తొలగించే అవకాశం ఉందని సమాచారం.
