సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: చిత్తూరు జిల్లా లో కుప్పం నేషనల్ హైవే పై నేడు, ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడుపల్లి మండలంలోని చిన్నశెట్టిపల్లిలో అతి వేగంగా దూసుకువచ్చిన లారీ ముందు వెళ్తున్న కారును వేగంగా లారీ ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టి నుజ్జునుజ్జు అయింది. దీంతోఈ కారు ప్రమాదంలో ముగ్గురు వైద్య విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో వైద్య విద్యార్థులు కుప్పంకి వస్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతులు వికాస్, కళ్యాణి, ప్రవీణ్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.