సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరులో ఇటీవల మాజీ మంత్రి కారుమూరి మాట్లాడుతూ..‘వైసీపీ నాయకులఫై దారుణాలు చేసిన టీడీపీ నాయకులను గుర్తు పెట్టుకుంటాం.వైసీపీ మరల అధికారంలోకి రాగానే గుంటూరు ఇవతల ఉన్న వాళ్లను ఇంట్లో నుంచి లాగికొడతారు. గుంటూరు అవతల ఉన్న వారిని నరికి పారేస్తారు’ అంటూ చేసిన వివాదాస్వాద మాటలపై పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్వాందిస్తూ.. కారుమూరి నుండి రక్షణ కావాలని ఆయన బెదిరింపులపై పోలీస్ స్టేషన్లలో పిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇదిలా ఉండగా నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ లక్ష్మణేశ్వ రంలో జరిగిన సభలో కారుమూరిని ఉద్దేశించి.. ‘ఒరేయ్ .. కొడకా.. కారుమూరి ఒళ్లు దగ్గర పెట్టుకో.. పద్ధతి మాట తీరు మార్చుకో.. కూటమి నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే తాట తీస్తామంటూ హెచ్చరించారు. మీ పాలనలో కూడా మేము పోలీస్ కేసులు భరించాం.. ఇంకా మిరే అధికారంలో ఉన్నట్లు వ్యవహరిస్తు న్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, మీరు మాటతీరు మార్చుకోవాలి, లేకపోతే మీ నియోజకవర్గానికి వచ్చి మీ కార్యకర్తల ముందే బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
