సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఊరట లభించింది. ఇటీవల పలనాడు లో జగన్ పర్యటనలో కారుక్రింద పడి సింగయ్య అనే వ్య క్తి మృతి చెందటంతో పోలీసులు కారు డ్రైవర్ తో పాటుకారు బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్ ఫై కూడా A 2గా కేసు నమోదు చెయ్యడం ఆ కేసులో జగన్ తో పాటు కారులో ప్రయాణించిన ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి,జగన్ పీఏ, మాజీ మంత్రి పేర్ని నాని, విడదల రజినిపై పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో ఈ ఐదుగురు కూడా క్వా ష్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు శుక్రవారం దానిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయస్థానం నిందితులపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అసలు కారు డ్రైవర్ ఫై కేసు నమోదు చేస్తారని అయితే కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై కూడా కేసు నమోదు చేస్తారా? అని కోర్ట్ ప్రశ్నించగా జగన్ పర్యటనకు ప్రజలు ఎక్కువ వస్తున్నారనికొన్ని నిబంధనలు విధించామని వాటిని పాటించలేదని ప్రభుత్వ లాయర్ వాదించగా మరి ఆలా అయితే కుంభమేళాకు ప్రభుత్వం నిబంధనలు తగిన ఏర్పాట్లు చేసిన కూడా జనం మరణిస్తున్నారు మరి ఎవరిదీ బాధ్యత? అని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. విచారణలో పోలీసులు సేకరించిన ఆధారాలు కోర్టుకు అందజేయానికి సమయం కావాలని ప్రభుత్వం కోరింది. కేసు విచారణ వచ్చే మంగళవారం కు వాయిదా పడింది.
