సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ మియాపూర్ కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత నేటి శుక్రవారం తెల్లవారు జాము కారు ప్రమాదంలో రోడ్డు డివైడర్ ను బలంగా ఢీ కొన్న ప్రమాదంలో అసువులు బాశారు. ఆమె గత నెల రోజులుగా ఆమెను ప్రమాదాల రూపంలో మృత్యువు వెంటాడుతుంది.. ఒకసారి లిఫ్ట్ ప్రమాదంలో ఇరుకొగా, ఇటీవల నే కారు ప్రమాదంలో గాయాలు అయ్యి కోలుకొంటున్నారు. ఇప్పుడు తాజాగా ఆమె మరణంతో అభిమానులు, కార్యకర్తలు, అనుచరులకు లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. కారు ప్రమాదం ని పోలీసులు నిర్ధారించినప్పటికీ పోలీసులు అనుమానస్వదా కేసుగా నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రాధమిక విచారణలో తెలిసిందేమిటంటే.. గత గురువారం అర్ధరాత్రి ఇంటి నుంచి ఎమ్మెల్యే లాస్య కుటుంబసభ్యులు బయల్దేరి వెళ్లారు. సదాశివపేటలో ఒక దర్గాలో ప్రార్థనల కోసం వెళ్ళిన లాస్య కుటుంబం వెళ్లింది. అక్కడ్నుంచి మూసాపేట్‌కు వెళ్లి అక్క కూతురు శ్లోకకు పరీక్షలు ఉండటంతో కుటుంబ సభ్యులు అందరూ అక్కడే ఉండిపోయారు. ఆకలిగా ఉండటంతో మార్గమధ్యలో దాబా కోసం మళ్లీ సదాశివపేట‌కు లాస్య నందిత, డ్రైవర్/పీఏ ఆకాష్ కలిసివెళ్లారు. ఆకాష్ డ్రైవింగ్ చేయగా.. లాస్య ముందు సీటులోనే కూర్చున్నారు. అయితే డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాద సమయంలో కారు 100 స్పీడులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *