సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు శుక్రవారం దేశవ్యాప్తంగా ప్రజలు దేశ జవాన్ లకు సెల్యూట్ చేస్తూ అన్ని ప్రాంతాలలో కార్గిల్ 25వ విజయ్ దివస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. సందర్భంగా కార్గిల్‌లోని ద్రాస్‌లో యుద్ధవీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ తాజగా సందర్శించారు.1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించిన సైనికులకు నివాళి అర్పించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు.అమర జవాన్ల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ‘షహీద్ మార్గ్’ (వాల్ ఆఫ్ ఫేమ్)ను సందర్శిస్తున్నారు. సందర్శకుల పుస్తకంపై సంతకం చేసి కార్గిల్ యుద్ధ కళాఖండాల మ్యూజియాన్ని పరిశీలించారు. వీటన్నింటి తరువాత వీర్ భూమిని కూడా సందర్శించి.. షింకున్ లా టన్నెల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు. కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవ వేడుకల్లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు. ఆయనతో పాటు కార్గిల్ యుద్ధ సమయంలో ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన జనరల్ వీపీ మాలిక్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. వారికీ ఘన నివాళ్లు అర్పించారు.
