సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ రిజిస్ట్రేషన్ ను (సింగిల్ విండో తరహాలో ..) స్లాట్ బుకింగ్, సంతకాలతో పనిలేకుండా ప్రత్యేక ఆన్ లైన్ సాఫ్ట్ వేర్ తో సులభతరం చేస్తున్నామని కార్డు ప్రైమ్ 2.0 పద్దతిని అమలులోకి తెస్తున్న వేళా.. దస్తావేజు లేఖరుల ఆందోళన లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద నేడు, గురువారం నిరసనలు జరుగుతున్నాయి. కార్డు ప్రైమ్ 2.0 పద్దతిని రద్దు చేసి పాతపద్ధతినే కొనసాగించాలని దస్తావేజులేఖరులు డిమాండ్ చేశారు. నూతన విధానాలతో తమ పొట్ట కొట్టవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దస్తావేజులేఖరుల సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా కేంద్రాలు భీమవరం, ఏలూరు రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి పెన్‌డౌన్ చేపట్టారు. దస్తావేజు లేఖరులకు లైసెన్సులు ఇవ్వాలని, ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ విధానం వల్ల దస్తావేజు లేఖరులు, వలంటీర్లు, డీటీపీ చేసేవారు కూడా ఆర్థికంగా నష్టపోతారని పాత పద్ధతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
