సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఈ నెల చివరి అంకంలో ప్రారంభం కాబోతున్న పవిత్ర కార్తీక మాసంలో స్వయంగా దేవతలు నిర్మించినట్లు పురాణ ప్రాశస్యం ఉన్న పంచారామ క్షేత్రాలను ( భీమవరం, పాలకొల్లు, సామర్ల కోట, ద్రాక్షారామం, పాలకొల్లు, అమరావతి) ఒకేరోజు దర్శించుకుంటే పుణ్యమని భక్తుల ప్రగాఢ నమ్మకం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా రవాణా సంస్థ్ధ కార్తీక మాసంలో పంచారామాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.. దీనికి సంబంధించి వాల్ పోస్టర్లను కూడా అన్ని ఆర్టీసీ బస్సు స్టాండ్ లలో నేటి శుక్రవారం నుండి ప్రదర్సనకు ఉంచారు. కోస్తా ఆంధ్ర లో స్థానిక ఆర్టీసీ బస్సు స్టాండ్ లలో వీటి వివరాలు తెలియజేసారు.ముందుగానే సీట్లు రిజర్వ్ చేసుకొనేవీలుంది. ఈనెల 26 నుంచి భీమవరం ఏలూరు, నూజివీడు డిపోల నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సులు సూపర్ ఎక్స్ప్రెస్, లగ్జరీ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.ప్రతి సోమవారం అదనపు బస్సులు ఉంటాయి.
