సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం గునుపూడి భీమవరం,, శ్రీ స్వామివారి హుండీలు లెక్కించగా కార్తీకమాసం నెల రోజులకు 11, 82, 662/= రూపాయలు ఆదాయం వచ్చింది. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాలయ సిబ్బంది, భక్తులు పాల్గొనగా దేవాదాయ ధర్మాదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్, వెంకటేశ్వరరావు మరియు శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి, ఆర్ గంగా శ్రీదేవి పర్యవేక్షణ నిర్వహించారని, దేవాలయ ఈ ఓ, ఎం అరుణ్ కుమార్ తెలిపారు.
