సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శివోహం అంటూ.. తెల్లటి మంచు తెరల మధ్య చలిగాలుల మధ్య పవిత్ర కార్తీక మాసం నేటి శనివారం నుండి ప్రారంభం అయిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని శివాలయాలు వైష్ణవ ఆలయాలు విశేషంగా భక్తులతో వారు చేసే దీపారాధనలతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని భీమవరం, పాలకొల్లు లోని పవిత్ర పంచా రామాలలో భక్తులు విశేషంగా దర్శనాలు చేసుకొంటూ దీపారాధనలు చేస్తున్నారు. ఇక భీమవరం గునుపూడి లో పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థనస్వామి వార్ల దేవస్థానం నందు కార్తీకమాసం మొదటి రోజు తెల్లవారు జాము న శ్రీ సోమేశ్వరునికి వేద మంత్రాలతో ప్రత్యేక అభిషేకం జరిగింది. భక్తులు విశేషంగా తరలి వచ్చారు. కార్తీకమాసోత్సవములు 1వ రోజు సందర్భముగా సేవలు నిమిత్తం రూ.22,700/-లు, దర్శనం నిమిత్తం రూ.14,250/-లు, కానుకలు ద్వారా రూ.1,436/-, లడ్డు ప్రసాదం వలన రూ.3,225/-లు, అన్నదానం ట్రస్టు నిమిత్తం దాతల నుండి రూ.36,039/-లు ఆధాయం రాగా ఈ రోజు న 1,250 మంది భక్తులకు అన్నప్రసాదం వితరణ చేయుట జరిగినది.అని దేవాలయ కార్యనిర్వహణాధికారి డి రామకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
