సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కార్తీక మాసం ముగింపు సందర్భంగా నేడు, సోమవారం పోలి పాడ్యమి నేపథ్యంలో నేటి తెల్లవారు జాము నుండి మహిళలు నీటిలో దీపాలు వదిలి పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో భీమవరం గునుపూడి సోమారామం ఎదురుగ ‘చంద్ర’ పుషరిణి వేలాది దీపాల వెలుగులతో కార్తీక మాస వీడ్కోలు శోభ తో కళకళ లాడింది. దేవాలయంలో పుష్ప అలంకరణతో పాటు తెల్లవారు జాము నుండి శ్రీ సోమేశ్వరునికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేసారు. కార్తీక మాసం ముగింపు నేపథ్యంలో భక్తులు.స్నానమాచరించి ఆవు నేతిలో ముంచిన వత్తులను అరటిదొప్పలలో పెట్టి వెలిగించి, నదిలో విడిచిపెట్టారు. రేపటి (మంగళవారం) నుంచి మార్గ శిర మాసం. అంటే విష్ణువుకు ఇష్టమైన మాసం. ఈ మాసంలో తొలి రోజు.. పోలి పాడ్యమి (Poli Padyami ). ఈ రోజు పోలి బొందితో స్వర్గానికి వెళ్లిన రోజు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు గజ ఈతగాళ్లు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో రద్దీగా మారింది.
