సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పరమేశ్వరుని అస్సిసులతో తమ జీవితాలలో వెలుగులు నిండాలని నేడు శుక్రవారం కార్తీకమాసం కు వీడ్కోలు పలుకుతూ.. పోలి పాడ్యమి నేపథ్యంలో నేటి తెల్లవారు జాము నుండి మహిళలు నీటిలో దీపాలు వదిలి పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో భీమవరం గునుపూడి పంచారామ క్షేత్రం ఎదురుగ సాక్షాతూ చంద్రుడు సృష్టించినదిగా పురాణాలలో పేర్కొన్న ‘చంద్ర’ పుషరిణి వేలాది దీపాల వెలుగులతో కళకళ లాడింది. గత రాత్రి నుండి అర్చకులు ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసారు. దేవాలయంలో పుష్ప అలంకరణతో పాటు తెల్లవారు జాము నుండి శ్రీ సోమేశ్వరునికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేసారు. ఇక మార్గశిర మాసం ప్రారంభం నేపథ్యంలో భక్తులు. స్నానమాచరించి ఆవు నేతిలో ముంచిన వత్తులను అరటిదొప్పలలో పెట్టి వెలిగించి,నీటిలో విడిచిపెట్టారు. మార్గశిర మాసం అంటే విష్ణువుకు ఇష్టమైన మాసం. ఈ మాసంలో తొలి రోజు.. పోలి పాడ్యమి (Poli Padyami ). ఈ రోజు పోలి బొందితో స్వర్గానికి వెళ్లిన రోజు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధర్మ కర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేసారు.
