సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన రాష్టంలో నామినేటెడ్ పదవుల కేటాయింపులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నేతలకు అధిక ప్రాధాన్యత లభించింది. గత ఎన్నికలలో కూటమి భాగస్వామ జనసేన, బీజేపీ పార్టీల కు సీట్ల కేటాయింపు కోసం త్యాగాలు చేసిన మాజీ ఎమ్మెల్యేలను పలు కీలక కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 కార్పొరేషన్ చైర్మన్ పదవులను ప్రకటించగా 7గురు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారే ఉండటం గమనార్హం. ఏలూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గన్ని వీరాంజనేయులకు ఆప్కాబ్ చైర్మన్ పదవితో పాటు ఏలూరు జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవులు కేటాయించడం పెద్ద హైలైట్. భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలానికి చెందిన మాజీ మంత్రి పీతల సుజాతకు ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. తాడేపల్లి గూడెం నుంచి వలవల బాబ్జీకి ఆంధ్ర ప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్‌గా నియమించారు.అలాగే తాడేపల్లిగూడెంకు చెందిన ఆకాశపు స్వామిని ఆంధ్రప్రదేశ్ టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌గా నియమించగా, మరోవైపు నర్సాపురానికి చెందిన కొల్లు పెద్దిరాజును ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సహకార సంఘం చైర్మన్‌గా నియమించారు. ఏలూరు పట్టణాభివృద్ది సంస్థ(ఇడా) చైర్మన్ పదవిని ఏలూరు నగర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న పెద్దిబోయిన వాణి వెంకట శివప్రసాద్ ఇడా చైర్మన్‌గా నియమించారు. కొవ్వూరులో గత ఎన్నికల్లో సీటు కోల్పోయిన మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా గుర్తింపు దక్కింది. నిడదవోలులో సౌమ్యుడు, నిబద్ధత కలిగిన నేతగా పేరున్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కు ప్రతిష్టాకరమైన ఆంధ్రప్రదేశ్ స్కిల్స్ డెవలప్మెంట్ సంస్థ చైర్మన్‌గా నియమించారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా లో ప్రతిష్టాకరమైన డీసీఎంఎస్ చైర్మన్ పదవి ని నరసాపురం జనసేన కు చెందిన మురళి కృష్ణ కు కేటాయించడం గమనార్హం..
