సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఉదయం నరసాపురం పార్లమెంట్ లోని తాడేపల్లి గూడెంలో జరిగిన బిజెపి సంస్థాగత ఎన్నిక ల కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడేపల్లి గూడెం జనసేన ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ , బిజెపి జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ గారు, అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజీ , స్థానిక బిజెపి – జనసేన – తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన పెంటపాడు మండల బీజేపీ అధ్యక్షులు దత్తు ప్రసాద్ కి అభినందనలు తెలిపి వారిని కేంద్ర మంత్రి సన్మానించడం జరిగింది. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. తనలాంటి భీమవరం కు చెందిన సాధారణ కార్యకర్త సైతం ప్రజా ప్రతినిధిగా, కేంద్ర మంత్రిగా,చేసిన ఘనత బీజేపీ దే అని, బీజేపీ లో మాత్రమే సామాన్య కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడిగా మరియు ప్రధానమంత్రిగా కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే కాగలరు. పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలి, అని పిలుపు ఇచ్చారు.
