సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా వేడుకలు ముగిసాయి. దేశవ్యాప్తంగా దుర్గా పూజ ఉత్సవం ముగింపు నిమజ్జనంలో జరిగిన అపశృతులు నేపథ్యంలో.. దేశంలోని పలు ప్రాంతాల్లో దుర్గా , కాళీ మాతల విగ్రహాల నిమజ్జనం సందర్భంగా 15మంది మరణించారు. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా జరిగిన ప్రమాదాల్లో పలువురు మరణించారు. గత బుధవారం రాత్రి పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి నగర సమీపంలోని మాల్ నదిలో దుర్గామాత విగ్రహాలను పెద్దఎత్తున భక్తులు గుమ్మిగూడి నిమజ్జనం చేస్తుండగా అకస్మాత్తుగా వరదనీరు వచ్చిపడింది. దీనితో వరదల్లో పలువురు భక్తులు కొట్టుకుపోయారు. నేటి గురువారం ఉదయానికి ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన మరో 15మందిని అధికారులు ఆసుపత్రిలోచేర్చడం జరిగింది. నదీ తీరంలో ఉన్నమరో 60 మందిని వరదల బారి నుంచి కాపాడమని మెజిస్ట్రేట్ చెప్పారు. అలాగే ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా నగరంలో దుర్గా విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఇద్దరు యువకులు యమునా నదిలో మునిగి మరణించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాలో వరదనీటిలో మునిగి ఆరుగురు మరణించారు.
