సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర వరూధిని ఏకాదశి సందర్భముగా నేడు, శనివారం శ్రీ నారాయణుడిని దర్శించుకొంటే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం వస్తుందని పురాణ సూక్తి నేపథ్యంలో భీమవరం పట్టణంలోని అన్ని విష్ణు అవతార దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలో భీమవరం పట్టణానికి సమీపంలో 11 కిమీ దూరంలో 450 ఏళ్ళ క్రితం స్వయం భువుడు గా వెలసిన కాళ్ళకూరు – శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నేడు, వేలాదిగా భక్తులు భారీ క్యూ లైన్లలో నిలబడి శ్రీ స్వామివారిని అలివేలుమంగా, పద్మావతి అమ్మవార్ల సమేతంగా దర్శించుకొని వారి అస్సిసులు పొందారు. ఎంతో దూరప్రాంతాల నుండి కూడా భక్తులు వాహనాలలో రావడంతో ఆ ప్రాంతం అంతటా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పలువురు భక్తులు తలనీలాలు, మొక్కులు చెల్లించారు. భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. శనివారం ప్రసిద్ధి పొందిన చక్ర పొంగలి ప్రసాదం వద్ద కూడా భారీ క్యూ లైన్ లలో భక్తులు నిలబడటం విశేషం. ఇఓ ఎం అరుణ్ కుమార్ భక్తుల సౌకర్యార్ధం చలువ పందిళ్ళతో పాటు చక్కటి ఏర్పాట్లు చేయించారు.
