సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి 11 కిమీ దూరంలో కాళ్ళ మండలం లో పురాణాల ఆధారంగా 450 ఏళ్ళ క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయం భువుడుగా వెలసిన కాళ్ళకూరు గ్రామం లో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాలు రేపు శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణంతో ప్రారంభం అవుతున్నాయని కార్యనిర్వహణాధికారి, ఎం అరుణ్ కుమార్ తెలిపారు. ఈనెల 17వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ స్వామివారి కల్యాణోత్సవాలలో నెల19 వ తేదీన దేవేరులతో శ్రీ స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవం గా నిర్వహిస్తామన్నారు. ఆ రోజు గోదావరి జిల్లాల నుండి వచ్చే వేలాది భక్తులకు ఇబ్బంది లేకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలలో హైలైట్ గా నిలిచే శ్రీ దేవేరులతో శ్రీవారి 30 అడుగుల రధోత్సవం ఈనెల 23 వ తేదీన మధ్యాహ్నం నిర్వహిస్తున్నారు. వేడుకలకు ముగింపుగా వేలాది భక్తులు పాల్గొనే అన్నసమారాధన జూన్ 1వ తేదీన నిర్వహించనున్నారు. కాళ్ల పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పట్లు చేస్తున్నారు.
