సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవత్వమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. వీరవాసరంకు చెందిన రెమల్లె వెంకటేష్ ఇటీవలే రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోవడంతో దాతల సహకారంతో ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం బాధితునికి రూ 38 వేలు సహకారం అందించారు. బాధితునిగా అండగా ఉంటామని దాతలు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. కోళ్ల నాగేశ్వరరావు, బాపిరాజు, చేనెమల్ల చంద్రశేఖర్, కారుమూరి సత్యనారాయణ మూర్తి, యర్రంశెట్టి శివకృష్ణ, లోకం పెద్దిరాజు, వబిలిశెట్టి రామకృష్ణ, జి సతీష్, బదరాల పుల్లేశ్వరరావు, పి రామాంజనేయులు కలిపి రూ 38 వేలను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా బాధితునికి అందించారు.
