సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో ఆ మధ్య ఉత్తర ఆంధ్రాలో సింహాచలం ఘటనలో 8మంది భక్తులు మరణించిన ఘటన మరువకుండానే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నేడు, శనివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో అక్కడ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం తో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో స్పాట్ లోనే తొమ్మిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానిక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.వీరిలో మృతులు ఎక్కువ మహిళలు ఉన్నట్లు తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *