సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వారణాసి/ భీమవరం :నేడు, ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ దంపతులు నేడు,ఆదివారం పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాశీ విశ్వనాథుడిని, కాలభైరవ స్వామిని దర్శించుకుని దేశ ప్రజల సౌఖ్యం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు.. శివరాత్రి పర్వదినం వేళ మోక్షదాయకమైన కాశీ క్షేత్రంలో, మహాదేవుని సన్నిధిలో గడపడం తనకు మరుపురాని ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల పాటు వారణాసి పర్యటనలో భాగంగా శనివారం కుటుంబ సభ్యులతో కలిసి గంగా హారతిని దర్శించుకున్నట్లు ఆయన తెలిపారు
