సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ప్రశాతంగా అభివృద్ధి పధంలో పయనిస్తున్న కాశ్మిర్ లో పాక్ ప్రేరిత ఉగ్రవాదులు మరో సారి తమ ఉన్మాద దమనకాండ ను అమలు పరిచారు. దీనితో నేడు బుధవారం ఉదయానికి అందిన సమాచారం ప్రకారం 38 మంది అమాయక యాత్రికులు మృతి చెందగా మరి కొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జమ్మూ కశ్మీర్ పహల్గాంలోని బైసరన్ మైదాన ప్రాంతంలో గత మంగళవారం సాయంత్రం కాశ్మిర్ అందాలతో సేదతీరుతున్న యాత్రికులపై మీరు.. హిందువా? ముస్లీమ్ మా ? అని అడుగుతూ హిందువులపై విదేశీ యాత్రికులపై కాల్పులు జరిపి వారి ప్రాణాలు తీసి వారి పైచిక ఆనందం పొందారు. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన ఘటన వెనుక కీలక సూత్రదారి లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా కసౌరి అలియాస్ ఖలీద్తోపాటు రావల్ కోట్కు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పర్యాటకులపై మొత్తం ఐదు లేదా ఆరుగురు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఇంకోవైపు ఈ కాల్పుల ఘటనతో సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ..తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకొని భారత్కు తిరిగి వచ్చారు. ఇక ఈ ఘటనతో జమ్మూ కశ్మీర్లోని సైన్యం అప్రమ్మత్తమైంది. అమెరికా అడ్జక్షుడు ట్రంప్, రష్యా అడ్జ్యాక్షుడు పుతిన్ లతో పాటు ప్రపంచ దేశాలు నేతలు ప్రధాని మోడీతో ఫోన్ లో మాట్లాడుతూ…. మృతులకు సంతాపం తెలుపుతూ ఈ ఉగ్రవాద చర్యను ఖండిస్తూ ,ఉగ్రవాద నిర్ములనలో భారత్ పక్షాన నిలుస్తామని అన్నారు. ,
