సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉగ్రవాదుల అరాచకాలతో అట్టుడికిన కశ్మీర్‌లో సుమారు 30 ఏళ్ళ తరువాత గత ఆదివారం నుండి సినిమాహాళ్లు పునఃప్రారంభమయ్యాయి.అతి త్వరలో మరిన్ని సినిమా హాళ్లు ప్రారంభాలతో వెండి తెరపై కాశ్మిర్ వాసులకు వినోదం పండనుంది ఉగ్రవాదల హెచ్చరికలు, గతంలో సినిమా హాళ్లు పేల్చివేతల కారణంగా ఇక్కడ థియేటర్లన్నీ మూతపడడంతో వాటి స్థానంలో ఇప్పుడు ప్రభుత్వమే మల్టీఫ్లెక్స్‌లు నిర్మించింది. దక్షిణ కశ్మీర్‌లోని సోఫియాన్, పుల్వామాల్లో ఏర్పాటు చేసిన మల్టీఫ్లెక్స్‌లను గత ఆదివారం జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. వీటిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మిషన్ యూత్ విభాగం, ఆయా జిల్లా యంత్రాంగాలు కలిసి నిర్మించాయి. ఇక్కడ సినిమాల ప్రదర్శనలతోపాటు, సమాచారం, యవత నైపుణ్యాభివృద్ధికి సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. త్వరలో ప్రతి జిల్లాలోనూ ప్రారంభిస్తామని వెల్లడించారు. ఒక థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్, మరోదాంట్లో భాగ్ మిల్కా భాగ్‌లను ప్రదర్శించారు. శ్రీనగర్‌లోని సోంవార్ ప్రాంతంలో నిర్మించిన మొట్టమొదటి మల్టీప్లెక్స్ రేపు, మంగళవారం ప్రారంభం అవుతుంది.. ఇందులో 520 సీట్ల సామర్థ్యంతో మూడు థియేటర్లు ఉన్నాయి. లాల్ సింగ్ ఛడ్డా సినిమాతో ఇవి ప్రారంభం కానున్నాయి.
