సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంటరీ బీజేపీ, జనసేన, టీడీపి ఉమ్మడి అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ భీమవరం పట్టణానికి నేడు బుధవారం మద్యాహ్నం చేరుకొన్నారు. ఉదయం 10 గంటలకు ఆకివీడు పట్టణం వద్ద నుండి కూటమి పార్టీల అభిమానులు ఎదురేగి బీజేపీ టీడీపీ, జనసేన కండువాలు కప్పి ఆయనకు తమ వాహనాలలో స్వాగతం చెప్పగా భారీ ర్యాలీగా భీమవరం లోని బీజేపీ పార్లమెంట్ కార్యాలయానికి ఉత్సహపూరిత వాతావరణంలో పలు చోట్ల ఆగుతూ మధ్యాహ్నం 3గంటలు దాటాక చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నరసాపురం పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం వద్ద భూమి ఫై ఉన్న కమలంపై పడి సాష్టాంగ నమస్కారంతో భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో ఆయనను పలువురు ఓదార్చారు. ఆయన 3న్నర దశాబ్దాల కష్టానికి తగ్గ గుర్తింపు, అది కూడా ఎన్నో అడ్డంకులను అధిగమించి తీవ్ర పోటీ మధ్య .. కూటమి పార్టీల అభ్యర్థిగా తనకు అవకాశం రావడంతో శ్రీనివాస వర్మ ఆనందంతో తబిఉబ్బవుతున్నారు. ఈ సందర్భముగా తనతో ఇంతకాలం ప్రయాణించిన బీజేపీ అభిమానులకు కృతజ్నతలు తెలిపారు. టీడీపీ జనసేన పార్టీల క్యాడర్ తో కలసి పొత్తులలో భాగంగా పనిచెయ్యడం తనకుఎప్పటినుండో జరుగుతున్నదేనని .. వారి సహకారంతో గతంలో ఇదే స్థానం నుండి బీజేపీ తరపున కృష్ణంరాజు, గంగరాజులను ఎంపీలుగా గెలిపించుకొన్నామని ఈసారి తన గెలుపు కూడా వారి సహకారంతో, ప్రజలు అస్సిసులతో సాధిస్తానని శ్రీనివాస వర్మ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *