సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల స్టాక్ మార్కెట్ వరుస నష్టాలతో భారత వాణిజ్య లోటు మూడేళ్ల కనిష్టానికి చేరడం, చాలా స్టాక్స్ దారుణంగా పడిపోవడంతో తెలివైన మదుపర్లు మళ్లీ కొనుగోళ్ల వేగం పుంజుకొంది. చాల రోజుల తరువాత గత సోమవారం లాభాలు అందుకున్న దేశీయ సూచీలు నేడు, మంగళవారం కూడా లాభాలలో దూసుకొనివెళ్ళాయి. గత సోమవారం ముగింపు (74, 169)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 500 పాయింట్ల తో దూసుకొనిపోయిన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. 75, 301 వద్ద రోజును ముగించింది.ముఖ్యంగా మెటల్, ఐటీ, ఫైనాన్స్ స్టాక్స్ భారీ లాభాలను ఆర్జించాయి. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే చివరకు 3251 పాయింట్ల లాభంతో 22, 834 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1055 పాయింట్లు ఎగబాకింది. బ్యాంక్ నిఫ్టీ 960 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.57 వద్ద ఉంది.
