సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:గత 2 రోజులుగా బంగారం ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బలహీనపడుతున్న డాలర్ తో సహా బంగారం దిగుమతులపై సుంకాలు తగ్గింపు, బంగారం నిల్వల పెరుగుదల వంటి అంశాలు కూడా వీటి రేట్ల తగ్గింపు లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా భారీగా పెరిగి సుమారు 90 వేల స్థాయికి చేరిన పసిడి ధరలు ప్రస్తుతం స్పల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో నేటి సోమవారం (మార్చి 17న) తెలుగు రాష్ట్రాలలో విజయవాడ, హైదరాబాద్లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.89,660గా ఉండగా, ఈ ధర నిన్నటితో పోల్చితే స్వల్పంగా రూ. 10 మాత్రమే తగ్గింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర విషయానికి వస్తే 10 గ్రాములకు రూ. 82,190కి చేరుకుంది. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 89,810 స్థాయికి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 82,340కి తగ్గింది. ఇక వెండి ధరలు కూడా కొంచెం తగ్గిపోయాయి. దీంతో హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర నిన్నటితో పోల్చితే రూ. 100 తగ్గి, రూ. 1,11,900 ధరకు చేరుకుంది. ఇదే సమయంలో ఢిల్లీలో అయితే కిలో వెండి ధర రూ. 1,02,900ధర ఉంది.
