సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏడాది క్రితం లక్ష రూపాయలకు దిగువన ఉన్న బంగారం ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి. గత కొద్దిరోజుల నుంచి చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు నిన్న నేడు, శుక్రవారం ఒక్కసారిగా కాస్తతగ్గాయి. నేడు, శుక్రవారం తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరల విషయానికి వస్తే..ప్రస్తుతం దేశీ మార్కెట్‌లలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,620 పలుకుతోంది. అలాగే పది గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.1,31,650 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,07,720 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధరలు బంగారం ధరలతో పోటీ పడుతున్నాయి. అయితే బంగారం తరహాలోనే గత రెండు రోజుల నుంచి వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న కిలో వెండి ధర రూ.3,10,000 వద్ద ట్రేడ్ అయింది. నేడు కిలోపై రూ.4000 ధర తగ్గింది. నేడు శుక్రవారం కిలో వెండి , ధర రూ.3,06,000 వద్ద అమ్మకాలు జారుతుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *