సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉత్తరాంద్ర లో ఉద్దానం కిడ్ని బాధితుల మరణాలు, కష్టాలు తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు ఎన్నో ఏళ్లుగా తెలుసు.. మరి ఎన్నో ఏళ్ల కల నేడు, గురువారం సాకారం అయ్యింది. శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సా ర్ కిడ్నీ రీసెర్చ్ –200 పడకల సూపర్ స్పె షాలిటీ హాస్పి టల్ ను మరియు కిడ్నీ రీసెర్చ్ సెంటర్-ని సీఎం జగన్ నేటి మధ్యాహ్నం 12- 20కి ప్రారంభించారు.( ఫై తాజా చిత్రంలో చూడవచ్చు) దివంగత ముఖ్యమంత్రి వైఎస్సా ర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు ప్రభుత్వం చేసిన కృషికి ఉత్తరాంధ్ర వైసిపి నేతలు సీఎం జగన్ కు అభినందనలు తెలిపారు. అనంతరం రైల్వే గ్రౌండ్ భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం సీఎం జగన్.. అలాగే రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సా ర్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితంచేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *