సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ వారంలో క్రిస్మస్ పండుగ పర్వదినం సందర్భముగా తెలుగులో పేక్షకుల ముందుకు ధమాకా, 18 పేజెస్ సినిమాలతో సీనియర్ హీరో రవితేజ , యువ హీరో నిఖిల్ పోటీ పడుతున్నారు. ఈ 2 సినిమాలు ఈ నెల 23 వ తేదీన విడుదలకు సిద్ధం అయ్యాయి. వీటితో పాటు విశాల్ డబ్బింగ్ సినిమా లాఠీ కూడా విడుదల కానున్నది. ఇక ధమాకా లో హీరో రవితేజ, టూ యాంగ్ హీరోయిన్ శ్రీలీల జంటకాగా, జయరామ్, రావు రమేశ్, సచిన్ ఖేడ్క ర్ కీలక పాత్రలలో సంగీతం :భీమ్స్ సిసిరిలియో. ఇక అఖిల్ తో కార్తికేయ 2 తో బంపర్ హిట్ కొట్టిన అభిషేక్ అగర్వా ల్, టీజీ విశ్వ ప్రసాద్ దీనికి నిర్మాతలు కావడం విశేషం. ఇక దర్శకత్వం : త్రినాథ రావు వహిస్తున్నారు. ఇక కార్తీకేయ2 తో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన హీరో నిఖిల్ మరోసారి అనుపమ పరమేశ్వరన్ జంటగా అజయ్, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో 18 పేజస్ వస్తుంది. దీనికి అగ్ర దర్శకుడు సుకుమార్ కధ అందించడం పెద్ద హైలైట్.. సంగీతం గోపీ సుందర్ అందిస్తున్నారు. ఇక, పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మించడం మరో ప్లస్ పాయింట్.. మంచి విజయాలు సాధించాలని కోరుకొందాం..
