సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: క్రిస్మస్ పర్వదినం కు ఆహ్వానం పలుకుతూ భీమవరం బేతని పేట లో, గురువు పేటలో జరిగిన పలు కార్యక్రమాలలో శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు పాల్గొన్నారు. ముందుగా నేడు ఆదివారం ఉదయం స్థానిక లూథరన్ చర్చి స్థానం లో నూతన చర్చ్ నిర్మాణం నిమిత్తం ఈ రోజు ఉదయం కొయ్యే మోషేను రాజు మరియు AELC ప్రెసిడెంట్ ఫ్రెడ్రిక్ పరదేశి బాబుతో కల్సి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో D. వర్గీస్ డానియెల్ గారు, శ్రీ పట్టా దేవరాజు. విల్సన్, రతన్ , శ్రీ శాస్త్రి అడ్వకేట్ తదితులు పాల్గొన్నారు. గరువుపేట లో గల క్రీస్తు లూథరన్ చర్చి ఆవరణం లో నూతనంగా నిర్మించిన వేదిక ను కొయ్యే మోషేను రాజు ప్రారంభించి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి బేతనీ పేట లూథరన్ చర్చ్ వారు నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను కొయ్యే మోషేను రాజు మరియు AELC మోడరేటర్ బిషప్ శ్రీ K. F. పరదేశి బాబు గారు ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో పట్టా దేవరాజు గారు Ex council member AELC,.మేడిది జాన్సన్, క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు YSRCP మరియు K. అనుపమ IPS అడిషనల్ DGP బీహార్ M. మహేంద్ర IPS, ASP ACB గుంటూరు,D.V. డానియల్ E C మెంబర్ AELC తదితరులు పాల్గొన్నారు.
