సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల 15ఏళ్ళ విద్యార్థినికి ప్రేమపేరుతో తాళి కట్టి అత్యాచారం చేసినకేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో నిందితుడుపురెళ్ళ సోమరాజును (భీమవరం మండలం తాడేరు గ్రామంలో నివాసం ) ఉండి పోలీసులు కేసు నమోదు అయ్యిన 24 గంటలోపే అరెస్టు చేశారు. అత్యా చారం, ఫోక్సో చట్టం , బాల్య వివాహాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నేడు, శనివారం భీమవరంలోని 20వ వార్డులో ఉన్న ఫోక్సో కోర్టులో హాజరు పరిచారు. తప్పు జరిగినప్పటికీ ఎంతో చొరవతో విద్యార్థి నీతో పాటు ఆమె తల్లి తండ్రులు పోలీస్ కేసు నమోదు చేసి కీచక టీచర్ గుట్టు రట్టు చేసినందుకు వారిని అభినందించాలి.. ఇది ఎందరో ఉత్తములుగా ముసుగు వేసుకొన్న కీచకులు కు గుణపాఠం అవ్వాలి..
