సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్‌సభ ఎన్నికలు కు సంబంధించిన కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ నేడు, శుక్రవారం కొనసాగుతోంది. నేడు మంచి ముహూర్తం కావడంతో చాలా మంది అభ్యర్థులు, ప్రముఖలు నామినేషన్లు వేయగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నామినేషన్ కూడా కుప్పం నియోజకవర్గంలో, ఆయన తరపున సతీమణి నారా భువనేశ్వరి వేశారు. కుప్పంలో రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)కి నామినేషన్‌ పత్రాలను ఆమె సమర్పించారు. నామినేషన్‌కు ముందు భువనేశ్వరి సారధ్యంలో భారీ ర్యాలీ జరిగింది. పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భముగా భువనేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని, ఓటు అనే ఆయుధంతో రాక్షస పాలనను అంతం చేయాలని ర్యాలీలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *