సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎప్పుడు తెలంగాణ లోని హైదరాబాద్ నుండే ఏపీలోని కార్యకలాపాలు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎట్టకేలకు ఎమ్మెల్యే గా చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్మించుకున్న స్వంత గృహంలో కుటుంబసభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు గృహప్రవేశం చేశారు.(గత 2 రోజులుగా ఢిల్లీ టూర్లో ఉన్న సీఎం చంద్రబాబు..) నేడు, ఆదివారం తెల్లవారుజాము 4:30 గంటలకే గృహప్రవేశ పూజా కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం ఉదయం 10 గంటల నుండి టీడీపీ పార్టీ నేతలు పలువురు చంద్రబాబు దంపతులుకు కుటుంబ సభ్యులకు అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ తగ్గించి ఏపీలోనే చంద్రబాబు, తనయుడు లోకేష్ ఉంటె ప్రభుత్వ పాలనకు పార్టీ క్యాడర్ కు అనువుగా ఉంటుందని టీడీపీలో సీనియర్స్ ఎప్పటి నుండో సూచిస్తున్నారు. ఈ శుభ కార్యక్రమానికి వచ్చే వారందరికీ కుప్పంలో పసందైన పలు రకాల విందు వంటకాలూ వడ్డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *