సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: రాష్ట్రంలో రోడ్డు షో లు నిషేదించిన నేపథ్యంలో కుప్పంలో చంద్రబాబు పర్యటనకు పోలీస్ లు అభ్యన్తరం చెప్పడంతో స్థానిక టీడీపీ శ్రేణులు తీవ్ర అసహనంకి గురయి తీవ్ర ఆగ్రహంతో కుప్పం లో పోలీసులపై కలియబడటం జరిగింది. అయినప్పటికీ పోలీస్ అధికారులు . నిబంధనలు పాటించాల్సిందేనని చంద్రబాబుకు స్పష్టం చేయగా, ఏంటిది ? నా నియోజకవర్గంలో నేను తిరగకూడదా?‘నాకే రూల్స్ చేబుతారా’ అంటూ పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వెళ్లగక్కా రు. రోడ్డు ఫై వాహనం వెళ్లవచ్చునని కానీ రోడ్డు షో లకు సమావేశాలకు అనుమతి తప్పనిసరి అని పోలీసులు తేల్చి చెప్పారు. దానితో చంద్రబాబు పర్యటన నిలచిపోయింది. చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో మీడియాతో మాట్లాడుతూ.. .కుప్పం వస్తానని నెల క్రితమే ప్రకటించానని, కుప్పం పర్యటనపై డీజీపీకి లేఖ రాశానని, ప్రభుత్వం అక్రమంగా చీకటి జీవో తెచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌ పోలీసుల దయాదాక్షిణ్యాలతోనే సభలు పెట్టుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్ననే విజయనగరంలో వైసీపీ మీటింగ్‌ పెట్టుకుందని ప్రస్తావించారు. వైసీపీ పనైపోయిందని, వైసిపి కి టీడీపీ ని చుస్తే వణుకు పుడుతుందని, అందుకే నా మీటింగ్‌కు ప్రజలు పెద్దఎత్తున వస్తున్నారని, పోలీసులు ప్రజల కోసమే పని చేయాలని, కానీ పరిధులు అతిక్రమిస్తున్నారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *