సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంత్రి అంబటి రాంబాబు నేడు, ఆదివారం ఏర్పటు చేసిన మీడియా సమావేశంలో పలు సంచలన వ్యాక్యలు చేసారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు సభలు అన్ని సందుల్లో మీటింగ్లు పెట్టిన కూడా జనం రాలేందంటే అట్టర్ ప్లాప్.. ఆయన ఎలానూ కుప్పంలో ను ఆయన పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఓడిపోవడం ఖాయం అని తెలుస్తుంది. ఓడిపోతామన్న నిరాశతో టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని , అసలు చంద్రబాబు పార్టీలో పోటీ చేసేందుకు నేతలే లేరని, అందుకే మేము వదిలేసిన వ్యక్తులకు టీడీపీలో టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నారని ఎద్దేవా చేసారు. సందుల్లోమీటింగ్లు పెట్టి కూడా జనం రాలేందంటే మీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే నైతిక అర్హత చం ద్రబాబుకు లేదు. చంద్రబాబుకు సిగ్గు, శరం లేదు. తన పార్టీ అభ్య ర్థుల పేర్లు కూడా చంద్రబాబుకు గుర్తు లేవు. టికెట్స్ మాట దేవుడు ఎరుగు .. సొంత పార్టీ నేతలే చంద్రబాబును తిడుతున్నారు. చంద్రబాబు తో వెళ్లి బీజేపీ జనసేన నష్టపోవడం ఖాయం.. ఇప్పటికే సీట్లలో వారిని మోసం చేసాడు. ఆయనతో పొత్తు పెట్టుకోవడం అంటే స్వయంగా సమాధి కట్టేసుకోవడమే.. అని గాటు వ్యాఖ్యలు చేసారు. ఈసారి ఎన్నికలలో మళ్లీ వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ కూడా ఓడిపోతాడు. అసలు పవన్కు రాజకీయాలు ఎందుకు? రెండు రోజలు ప్రచారం చేసి ఐదు రోజలు పడుకుంటాడు. రాష్ట్రమంతటా పవన్ తిరిగే పరిస్థితి లేదు. పోలవరాన్ని ఏటీఎం లా వాడుకున్నది ఎవరు? అది ప్రధాని మోడీయే చెప్పారు. సంక్రాంతికి డాన్స్లు చేస్తే తప్పేంటి? ఆనంద తాండవం చేస్తాను, చంద్రబాబులా, పవన్ లా నేను పొలిటికల్ డాన్సర్ను కాదు. రోజుకో పార్టీతో డాన్స్ చేస్తే వ్యక్తులు వారు .. ఇప్పటికే వైసీపీ మినహా అన్ని పార్టీలతో డాన్స్ చేసేసారు వారు అని ఎద్దేవా చేసారు మంత్రి అంబటి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *