సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, .సోమవారం ఉదయం ఉండి నియోజకవర్గం లో కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి ఎంపీ రఘురామా కృష్ణంరాజు తన ఎన్నికల ప్రచారాన్ని భీమవరం పట్టణం శివారు సరిహద్దు గ్రామాలయిన కుముదవల్లి, విస్సాకోడేరు గ్రామాలలో ప్రత్యేక వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ పర్యటించారు. ఆయా గ్రామాలలో పలువురు పెద్దలను సంఘాల నేతలతో, దేవాలయాల వద్ద మహిళలతో సమావేశం అయ్యి సైకిల్ గుర్తు ఫై ఓట్లు వేసి తనను బలపరచాలని, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఈ ప్రాంతాలను మరింత అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని అమలు చేస్తానని హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎమెల్య , తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు , జనసేన పార్టీ ఉండి నియోజకవర్గం ఇంచార్జ్ జుత్తుగ నాగరాజు , తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
