సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఛత్తీస్‌గఢ్ రాజధాని అయిన రాయ్‌పూర్‌కు 350 కిలో మీటర్ల దూరంలో ఉండే మారుమూల పధారపడి పల్లెటూరు లో ఊహకందని ఒక అద్భుత సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన 8ఏళ్ల కుర్రాడు గత సోమవారం రోజు ఎప్పటిలాగే తన స్నేహితులతో కలసి ఇంటి బయట ఆడుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిన ఓ నాగుపాము.. ఆ అబ్బాయి చేయికి చుట్టుకుని కాటేసింది. దీంతో భయాందోళనలకు గురైన ఆ చిన్నోడు తీవ్ర కోపంతో తీవ్ర నొప్పితో కూడా తన చేతికి చుట్టుకున్న పామును బలంగా కసితీరా కొరికాడు దీంతో పాము చనిపోయింది.కాగా.. విషయం తెలిసి కుటుంబ సభ్యులు ఆ కుర్రాడిని స్థానికంగా ఉన్న హాస్పిటల్‌కు తరలించాడు. డాక్టర్లు వెంటనే అతడిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించి.. ఆంటీ వీనమ్ ఇంజక్షన్ ఇచ్చారు. అనంతరం ఒక రోజుపాటు అబ్జర్వేషన్‌లో పెట్టి.. డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్స్ ఇటివంటివి అరుదుగా జరుగుతాయని కరిచిన పాముకు ఆ సమయంలో విషం లేకపోవడంతో అతడికి ఎటువంటి అపాయం కలగలేదని ప్రకటించారు. .
