సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పేకాట క్లబ్ ల వ్యవహారంలో, సివిల్ వ్యవహారాలలో డీఎస్పీ పాత్ర ఫై పవన్ ఎస్పీ కి ఆదేశాలు ఇవ్వడం ఫై ఉండి ఎమ్మెల్యే, , అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు నేడు, బుధవారం స్వాందించారు. తనకున్న సమాచారం మేరకు భీమవరం డీఎస్పీ జయసూర్యకు ‘మంచి ట్రాక్ రికార్డు’ ఉందని పేర్కొన్నారు. నిజానికి భీమవరం పరిసర ప్రాంతాలలో, జిల్లా వ్యాప్తంగా 13 ముక్కల పేకాట సాధారణమేనని జూదం కాదని,ఒకవేళ భీమవరంలో అసాంఘిక జూదాలు ‘ఎవరి అండ’తో నిర్వహించిన తప్పేనని.. మరి పవన్ కు ఎవరు పిర్యాదు చేసారో? ఆయన మిగతా శాఖలలో కూడా పర్యవేక్షించడం… ఎస్పీ కి ఫోన్ చేసి జయసూర్య ఫై నివేదిక కోరారని నాకు మీడియాలోనే తెలిసింది. మా ఉండి పరిధిలో మాత్రం ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగటం లేదు అన్నారు. జిల్లా ఎస్పీ అదాన్ హస్మి కూడా పవన్ తనకు ఫోన్ చేసి మాట్లాడటం నివేదిక కోరటం ఫై మాట్లాడుతూ.. పోలీసులు ఇక్కడ సెటిల్మెంట్స్ ఏమి చెయ్యరని, సివిల్ వ్యవహారాలలో తల దూర్చరని తాను చెప్పగలనని మరి డీఎస్పీ జయసూర్య ఫై ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. కాబ్బటి ఎవరైనా ఆధారాలతో సాక్ష్యాలు అందజేస్తే. నివేదిక పంపుతామని అన్నారు. .మొత్తానికి డిఎస్పీ వ్యవహారం కూటమి నేతలలో దూరం పెంచేదిగానే కనపడుతుంది.
