సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం . కూటమి మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉంది. మేనిఫెస్టోలో మోదీ, బీజేపీ ఫొటోలు వేయొద్దని ఆ పార్టీ కోరినట్లు తెలుస్తుంది. దీనితో మ్యానిపెస్టో పుస్తకంపై మోదీ, నడ్డా, అమిత్, పురేందేశ్వరి ఫొటోలు లేకుండా కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అడ్జక్షురాలు పురంధరేశ్వరి దూరంగా ఉన్నారు. బీజేపీ ఒప్పుకోకపోవడంతో చంద్రబాబు, పవన్ ఫొటోలతో మేనిఫెస్టో విడుదల చేశారు అని సమాచారం. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ మాత్రమే హాజరు అయినప్పటికీ మేనిఫెస్టో కాపీని పట్టుకొని ఫొటో దిగటానికి ఆయన అంగీకరించలేదు. కూటమి మేనిఫెస్టోకు టీడీపీ, జనసేనదే బాధ్యత అని చంద్రబాబు చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రజాకర్షణ పథకాలతో ప్రజలకు డబ్బులు ఇస్తూ సీఎం జగన్ బద్దకస్తులుగా మారుస్తున్నాడని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నాడని, శ్రీలంక చేస్తున్నాడని గగ్గోలు పెట్టి ఇప్పుడు ఎన్నికల వేళా అంతకు మించి’ ప్రజా సంక్షేమ, ఆకర్షణ పథకాలతో మ్యానిపెస్టో విడుదల చేస్తుండటంతో.. రాబోయే విమర్శలకు పరిణామాలకు బీజేపీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది గత 2014 ఎన్నికలలో మేనిఫెస్టోలో చంద్రబాబు.. మోదీ ఫొటో పెట్టారు.. అప్పటి హామీలు అమలు కాకపోవడంతో బీజేపీ కాస్త ముందు జాగ్రత్తతో ఈసారి ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తుంది.
