సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన, బీజేపీ బలపరిచిన ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు నేడు, సోమవారం ఉదయం భీమవరం శివారులోని తన నివాసం నుండి నామినేషన్ దాఖలు చేయడానికి భారీ ర్యాలీగా ఉండి లోని ఎం ఆర్ ఓ కార్యాలయానికి తరలి వెళ్లి ఎన్నికల రిటర్నినింగ్ అధికారికి తన నామినేషన్ పత్రం పార్టీ బి పారం తో పాటు అందజేశారు. తనకు మద్దతు పలుకుతున్న కూటమి నేతలకు క్యాడర్ కు ఎంపీ రఘురామా కృతజ్ఞలు తెలుపుతూ .. కూటమి అధికారంలోకి వచ్చాక నా శక్తి మేర ఉండి ని మరింత అభివృద్ధి పధంలో నిలబెడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామరాజు ప్రధాన ఆకర్షణగా నిలబడగా నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ సంఘీభవంగా పాల్గొనడం విశేషం. ఇకపై ఉండి అసెంబ్లీ ఎన్నికలు లో రాజకీయం రసవత్తరం గా మారనుంది. ఇంకా కలవపూడి శివ స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారంలో దూసుకొనిపోతున్నారు. ఆయనను కూడా తనకు మద్దతు ఇవ్వవలసినదిగా రఘురామా కోరనున్నారు. ఉండి టీడీపీ లో ఏర్పడిన కల్లోలం తాజా పరిణామాలతో నెమ్మదించే అవకాశం కనపడుతుంది.
