సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగిపోతున్నాయి. వరి ఎక్కువ పండించే తెలుగు రాష్ట్రాలలో అడ్డు అదుపు లేకుండా బియ్యం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 26 కేజీల బియ్యం బస్తా ఫై గతంలోకంటే కేవలం 3వారాల్లో తుపాను పేరు చెప్పి పెద్ద ఎత్తున నష్టాన్ని సాకు చూపించి ధరలు 200 రూపాయలు పైనే పెంచేశారు. ( ఈవిషయం 10 రోజుల క్రితమే తొలిసారిగా మన సిగ్మా న్యూస్ లో ఐటెం ఇచ్చాము )దీనితో మధ్యతరగతి వారు ఎక్కువ ఉపయోగించే సన్న బియ్యం నాణ్యమైనవి కిలో రూ. 60 దాటాయి.త్వరలో బాసుమతి బియ్యం ధర కేజీ 100 రూపాయలకు సన్నబియ్యం చేరిపోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక పప్పులు కిలో రెట్టింపు అయ్యాయి. చివరకు ఉప్పు కూడా కిలోకు రూ. 5 పెంచారు. ప్రస్తుతం భీమవరం కూరగాయల రిటైల్ మార్కెట్ లో చూసుకొంటే.. కూరగాయలు గాయాలు చేస్తున్నాయి. ఆఖరికి 10 రూపాయలు అమ్మే తోటకూర కట్ట కూడా 20 రూపాయలు అయిపొయింది. పెన్నాడ వంకాయలు కేజీ 120, టమాటాలు కేజీ 40 , దొండకాయలు కేజీ 70, క్యారెట్ కేజీ 80 రూపాయలు ఇక మిగతా.. ఉల్లి 25 నుండి 50 రూ పైగా పెరిగి ఇప్పుడిప్పుడే దిగి వస్తుంది. అన్ని కూరగాయలు సుమారుగా కిలో 80- 100 రూపాయలు పైమాటే.. ఇక చికెన్ ధరలతో కూరగాయధరలు పోటీ పడుతున్నాయి.మటన్ ఎప్పుడో 2 ఏళ్ళక్రితమే కేజీ 800 దాటిపోయిందనుకోండి..30 క్రోడి గుడ్ల అట్ట ధర హోల్ సెల్ గా 180 రూపాయలకు చేరిపోయిందంటే ఒక్క గుడ్డు 7నుండి 8 రూపాయల వరకు రిటైల్ గా అమ్మడం ఎప్పుడైనా చూశామా ? నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెరుగుతుండడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది. ఇది ఆషా మాషిగా చూసే వ్యవహారం కాదు.. దేశవ్యాప్తంగా సామాన్యుడి బ్రతుకు ఆందోళనలో పడింది అని సంకేతాలు పాలకులు పట్టించుకోకపోతే.. ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *